వాహనదారులకు శుభవార్త....
- January 08, 2017
హైదరాబాద్: జనవరి 13 వరకు తమ నిర్ణయాన్ని వాయిదావేసుకున్నట్లు పెట్రో డీలర్లు ప్రకటించారు. బ్యాంకులు తమకు చార్జీలు వేస్తున్నాయన్న ఆందోళనతో నేటి నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకోబోమన్న పెట్రో డీలర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. చార్జీల నిర్ణయాన్ని 13 వరకు వాయిదావేసుకున్నారు. అప్పటివరకు కార్డులతో పెట్రోలు అమ్మకానికి ఒప్పుకున్నారు. బంకుల్లో స్వైపింగ్ మిషన్ల ద్వారా పెట్రోలు అమ్మకం జరిపితే 1 శాతం సర్వీసు చార్జీ వసూలు చేస్తామని బ్యాంకులు చెప్పడంతో.. ఆదివారం అర్ధరాత్రి నుంచి కార్డులు అంగీకరించకూడదని పెట్రోల్ డీలర్ల అసోషియేషన్ నిర్ణయించింది. చార్జీ వసూలు బ్యాంకులు హఠాత్తుగా తీసుకున్న అక్రమ నిర్ణయమని పెట్రోల్ బ్యాంక్ యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యాంకులు విధించాలనుకున్న ఈ కొత్త చార్జీ భారమంతా తమపైనే పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బ్యాంకులు చార్జీల వసూలును 13 వరకు వాయిదా వేయడంతో పెట్రో డీలర్లు వెనక్కి తగ్గారు. వారు కార్డుల వినియోగంపై 13 వరకు వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







