జెరూసలేంలో ట్రక్కు బీభత్సం...
- January 08, 2017
- నలుగురు మృతి, 13 మందికి గాయాలు
జెరూసలేం : ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో ఆదివారం ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ ట్రక్కును జనాలపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదం లో నలుగురు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్నట్టు పోలీస్ అధికార ప్రతినిధి రోసెన్‌ఫెల్డ్ తెలిపారు. ఘటనాస్థలి వద్ద అప్పటికే ఉన్న సైనికులపై కూడా ట్రక్కును తీసుకెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో, అప్రమత్తమైన సైనికులు ట్రక్కు డ్రైవర్‌ను కాల్చి చంపారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్టు రోసెన్‌ఫెల్డ్ తెలిపారు. జెరూసలేం మేయర్ నిర్ బర్కత్ ఘటనాస్థలాన్ని సందర్శించారు.
ఉగ్రవాద చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్ర సంస్థ కూడా ప్రకటించుకోలేదు.
ఈ దాడికి పాల్పడ్డ వారిని ప్రశంసిస్తున్నట్టు హమాస్ ఉగ్రసంస్థ అధికార ప్రతినిధి అబ్దుల్ లతీఫ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







