చిన్నారిని వదిలివెళ్లిన భారతీయ తల్లిదండ్రులకై వెతుకుతున్న యూ. ఏ. ఈ. పోలీసులు
- September 11, 2015
ముక్కుపచ్చలారని 3 సంవత్సరాల చిన్నారిని ఖోర్ ఫక్కన్ బీచ్ లో వదిలి వెళ్ళిన తల్లిదండ్రులను గురించి యూ. ఏ. ఈ. పోలీసులు సెప్టెంబర్ 4 వ తేదీనుండి వెతుకుతున్నారు. ప్రస్తుతం షార్జా చిల్డ్రన్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్ వారి రక్షణలో ఉన్న, ఇండియాకి చెందిన ఈ బాలుడు, తన పేరు తప్ప, తల్లిదండ్రుల పేర్లు చెప్పలేకపోతున్నాడు. పోలీసులు బాలుని తల్లిదండ్రుల గురించి ప్రశ్నించగా, వారు రెస్టారెం టుకు వెళ్లారని, తిరిగివస్తారని అమాయకంగా బదులిచ్చాడు. తనకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించామని, తమ సోషల్ మీడియా అకౌంట్లలో బాలుడి ఫోటోను పెట్టగా, కొంత మంది గుర్తుపట్టి, అతని తల్లిదండ్రుల ఫోన్ నంబ ర్లను ఇచ్చారన్నారు. ఇక్కడ పిల్లలను తమ సొంత పిల్లల్లాగే చూసుకుంటామని, ఇక్కడ కేర్ టేకర్స్ తోపాటు, స్వచ్చందo గా పిల్లలను చూసుకొనేందుకు అనేక మంది తల్లులు ముందుకు వస్తారని, షార్జా సోషల్ సర్వీసెస్ హెడ్- అఫఫ్ అల్ మెర్రి తెలిపారు. చిన్నారులను వదిలివెళ్లిన తల్లిదండ్రులను వెతికి పట్టుకోవడం కష్టమైనప్పటికీ, షార్జా పోలీసులు గత అన్వేషణాలలో సఫలీకృతులయ్యారు. అందువలనే ఈ బాబు కూడా తన తల్లిదండ్రుల వొడిలోచేరి ముద్దులోలకాలని ఆశిద్దాం!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







