శ్రీమంతుడి తగిన సోదరి శ్రీమంతురాలనిపించుకుంది
- September 11, 2015
శ్రీమంతుడి తగిన సోదరి శ్రీమంతురాలనిపించుకుంది. టాలీవుడ్ హీరో, ప్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో గల్లా పద్మావతి ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అంతేగాకుండా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి తాను కూడా గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించింది. అంతకుముందు మహేష్ బాబు పాలమూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోగా.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తెలంగాణలోని ఓ గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నారు. తాజాగా ప్రిన్స్ సోదరి పద్మావతి కూడా గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామం దత్తత కోసం ఆమె ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోగా, గ్రామాభివృద్ధి కమిటీ ఆమోద ముద్ర వేసింది. అంతేగాకుండా, పద్మావతి నిర్ణయం పట్ల కంచర్లపాలెం వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇక గుంటూరులోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించడమే కాకుండా మరుసటి రోజే ఆ గ్రామంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







