బహ్రైన్ లో భారతీయ కార్మికులపై దౌర్జన్యం - విచారణ చేస్తున్న అధికారులు
- September 11, 2015
బహ్రైన్, సలామాబాద్ లోని ఒక పారిశుధ్య సేవల సంస్థలో పనిచేస్తున్న థామస్ దేవాసియా 32, జితేష్ ఆరాత్తాoకడీ 30, ప్రవీణ్ నారాయణన్ 30 మరియు ఆషేరాఫ్ కున్నోత్ మీథాల్ 41 అనే నలుగురు భారతీయులు, తమ యజమాని తమ పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకొని, తమను కొడుతున్నారని, దుర్భాషలాడుతున్నారని, వేతనాలు కూడా సరిగా చెల్లించడం లేదని భారతీయ దౌత్య కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో, అధికారులు విచారణ చేస్తున్నారు.
ఎంతో ప్రాధేయపడిన మీదట తమ భార్యా, పిల్లల పాస్ పోర్టులను మాత్రం తిరిగి ఇచ్చారని, బతుకు జీవుడా అని స్వదేశానికి వారిని పంపించానని దేవాసియా అనే అతను చెప్పాడు. . అమిత ఉష్ణోగ్రతల వలన కార్మికులు జబ్బులపాలైన పట్టించుకోరని, కండిష న్ లో లేనివి, ఏ. సి. లేని వాహనాలను నడపమని నిర్బంధిస్తారని, తమను నిద్రకూడా పోనీయట్లేదని, నారాయణన్ అనే వ్యక్తి తన పాస్ పోర్టును తిరిగివ్వమని అడిగిన మీదట తీవ్రంగా గాయపరచిన మీదట పరిస్థితి పీకలదాక వచ్చిందని, అందుకే ఫిర్యాదు చేశామని, ఐతే తాను బహ్రైనీయుడైనందువల్ల తనను ఎవరు ఏమీ చేయరని అతను అన్నాడనీ వాపోయారు. ఈ విషయంపై వివరణ ఈయడానికి సదరు కంపెనీ నుండి ఎవరు నోరు మెదపకపొవడo కొసమెరుపు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







