పాకిస్థాన్ సరిహద్దును మూసివేయనున్న చైనా

- January 11, 2017 , by Maagulf
పాకిస్థాన్ సరిహద్దును మూసివేయనున్న చైనా

అక్రమంగా దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించేందుకు పాకిస్తాన్ సరిహద్దు పొడవునా భద్రత కట్టుదిట్టం చేయనున్నట్టు చైనా ప్రకటించింది. ఈ మేరకు జిన్‌జియాంగ్ ప్రభుత్వం వెల్లడించినట్టు అక్కడి అధికారిక న్యూస్ ఏజెన్సీ జిన్హువా పేర్కొంది. ఉగ్రవాదుల చొరబాట్లను కట్టడి చేయడంలో పాకిస్తాన్ విఫలం కావడంపై చైనా ఎంత అసహనంతో ఉందో తాజా పరిణామాలు చెప్పనే చెబుతున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో శిక్షణ తీసుకున్న తీవ్రవాదులు ఇక్కడికి తిరిగి వచ్చి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు జిన్జియాంగ్ కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం జిన్జియాంగ్‌లోని హోటన్‌లో ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలోనే ఈ ప్రకటన వెలువడింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సహా మరో నాలుగు దేశాలతో జిన్జియాంగ్ సరిహద్దు పంచుకుంటోంది. హోటన్‌లో డిసెంబర్ 28న ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఐదుగురు పౌరులు మృతిచెందారు. దీంతో అక్కడి సైన్యం ఆదివారం తమకు లొంగకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను కాల్చిచంపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com