ఆస్కార్ ను కైవసం చేసుకున్న మరో తమిళుడు
- January 11, 2017
సినీ ప్రపంచంలో అత్యంత ప్రతి ష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును మరో తమిళుడు గెల్చుకు న్నాడు. ఆస్కార్ గెల్చుకున్న తొలి భారతీయుడిగా చరిత్రకెక్కిన మ్యూజిక్ మ్యాస్ర్టో ఏఆర్ రెహ్మాన కూడా తమిళుడేనన్న విషయం తెలిసిందే. ఉత్తమ నటీనటులు, దర్శకులు వంటి ప్రధాన విభాగాలతోపాటు ప్రచారం పొందని మరెన్నో విభాగాల్లో ఆస్కార్ అవార్డు ప్రదానం చేస్తారు. వాటిలో ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం. 'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స' అవార్డు ను ప్రతి యేటా అందజేస్తున్నారు. ఈ ఏడాది 18 మంది టెక్నీషి యన్లకు ఆస్కార్ ప్రకటించగా, వారి లో ఒకరైన కిరణ్భట్ తమిళుడే. కోయంబత్తూరు స్వస్థలం. కోవై నగరంలోని సాయిబాబా కాలనీ నివాసితుడు.
ప్లస్‌టు వరకు కోవైలోనే చదివిన కిరణ్ భట్ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. చదువు పూర్తయిన తరువాత 2004 నుంచి హాలీవుడ్ చిత్రాల్లో గ్రాఫిక్స్ కళాకారుడిగా పనిచేస్తున్నారు. సమీపకాలంలో విడుదలైన 'అసెంజర్స్', 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన', 'స్టార్ వార్స్ 7' చిత్రాలకు పనిచేశారు. కిరణ్ భట్ గ్రాఫిక్స్ విభాగంలో ఆస్కార్ బిరుదు సాధించినట్టు ఆయన తండ్రి శ్రీనివాస్ భట్ కోవైలో వెల్లడించారు. ఇంతకుముందు రెండుసార్లు ఆస్కార్‌కు నామినేషన సాధించాడని, ఈసారి అవార్డు సాధించడం అమితానందంగా ఉందని శ్రీనివాస్ తెలిపారు.
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







