పాకిస్థాన్ సరిహద్దును మూసివేయనున్న చైనా
- January 11, 2017
అక్రమంగా దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించేందుకు పాకిస్తాన్ సరిహద్దు పొడవునా భద్రత కట్టుదిట్టం చేయనున్నట్టు చైనా ప్రకటించింది. ఈ మేరకు జిన్జియాంగ్ ప్రభుత్వం వెల్లడించినట్టు అక్కడి అధికారిక న్యూస్ ఏజెన్సీ జిన్హువా పేర్కొంది. ఉగ్రవాదుల చొరబాట్లను కట్టడి చేయడంలో పాకిస్తాన్ విఫలం కావడంపై చైనా ఎంత అసహనంతో ఉందో తాజా పరిణామాలు చెప్పనే చెబుతున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో శిక్షణ తీసుకున్న తీవ్రవాదులు ఇక్కడికి తిరిగి వచ్చి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు జిన్జియాంగ్ కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం జిన్జియాంగ్లోని హోటన్లో ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలోనే ఈ ప్రకటన వెలువడింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సహా మరో నాలుగు దేశాలతో జిన్జియాంగ్ సరిహద్దు పంచుకుంటోంది. హోటన్లో డిసెంబర్ 28న ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఐదుగురు పౌరులు మృతిచెందారు. దీంతో అక్కడి సైన్యం ఆదివారం తమకు లొంగకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను కాల్చిచంపింది.
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







