మార్చ్ లో మొదలుకానున్న 151వ చిరు చిత్రం
- January 14, 2017
మెగాస్టార్ వెండితెర కు తన 150 వ చిత్రం ఖైదీ నెం 150 తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు..జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ, మంచి టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది..ఇక తన 151 వ చిత్రానికి కూడా ముహూర్తం పెట్టేసాడని సమాచారం. ఇటీవల మెగా పవర్ స్టార్ కు ధృవ హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి దర్శకత్వం లో చిరు 151 వ చిత్రం చేయబోతున్నాడు. ఇటీవలే సూరి చెప్పిన కథ చిరు, చరణ్ లకు బాగా నచ్చడం తో దానిని డెవలప్ చేయమని చెప్పారట.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం, మార్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజునాడే కుటుంబ సభ్యుల సమక్షంలో లాంచ్ చేయనున్నారని సమాచారం. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ లో చిరంజీవి సరికొత్తగా లుక్ లో కనిపిస్తారని అంటున్నారు. అలాగే అన్నీ ప్లానింగ్ ప్రకారం జరిగితే షూటింగ్ కూడా మే, జూన్ నెలల్లో మొదలయ్యే అవకాశాలున్నాయట.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







