జైల్లో ఖైదీల గ్యాంగ్ వార్, 10 మంది మృతి
- January 14, 2017
జైల్లో ఖైదీల మధ్య గ్యాంగ్ వార్‌లో 10 మంది హత్యకు గురయ్యారు. బ్రెజిల్‌లోని రియో గ్రాండే డొ నార్టెలో గల అల్కాకుజ్ జైలులో జరిగిన ఈ పాశవిక ఘటనలో ముగ్గురు ఖైదీల తలలను ప్రత్యర్థులు వేరు చేశారని అధికారులు వెల్లడించారు.
అల్కాకుజ్ జైలులో శనివారం మధ్యాహ్నం అల్లర్లు మొదలైనట్లు స్థానిక న్యూస్ వెబ్‌సైట్ వెల్లడించింది. కొంతమంది దుండగులు.. ప్రత్యర్థుల బ్యారక్‌లపై దాడి చేసి హతమార్చారని జైళ్ల కొఆర్డినేటర్ జెమిల్టన్ సిల్వా వెల్లడించారు. ఘటన జరిగిన జైలును పోలీసులు చుట్టుముట్టి అన్ని దారులను మూసివేసినట్లు తెలిపారు. జైలు లోపల ఆయుధాలతో ఉన్న దుండగులను అదుపులోకి తీసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు.
అల్కాకుజ్ జైలులో 620 మంది ఖైదీలను ఉంచడానికి సౌకర్యాలు ఉండగా.. ఇప్పుడు అక్కడ 1000 మందికి పైగా ఖైదీలున్నారు. 2015 నవంబర్‌లో కూడా ఈ జైలులో అల్లర్లు చెలరేగాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







