హోరా హోరీ:రివ్యూ
- September 12, 2015
'చిత్రం' తో సెన్సేషనల్ డైరెక్టర్ గా నువ్వు నేను, జయం సినిమాల తర్వాత ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ గా అనతికాలం లోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన తేజ, ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులతో అంతే తక్కువ టైం లో కిందకు వచ్చేశారు. మరి ఇన్ని రోజుల తర్వాత తేజా హోరా హోరీగా కస్టపడి తీసిన హోరా హోరీ చిత్రం హిట్టా ఫట్టా ఇప్పుడు చూద్దాం. కథ: పట్ట పగలు నడి రోడ్డుమీద అందరు చూస్తుండగా హత్య చేసిన బసవ అనే రౌడి కేసు మాఫీ నిమిత్తం ఏసిపి తో పాతిక లక్షలకు బేరం కుదుర్చుకుంటాడు. తన చెల్లెలికి కట్నం గా ఇవ్వడం కోసమే బసవతో బేరం కుదుర్చుకున్న ఏసిపి, డబ్బు ని పెళ్లి సమయంలో ఇవ్వమంటాడు. ఒప్పందం ప్రకారం డబ్బు తీసుకుని ఏసిపి ఇంటికి వెళ్ళిన బసవకి కాబోయే పెళ్ళికూతురు ఏసిపి చెల్లెలు అయిన మైథిలి ఎదురౌతుంది. దీంతో మీ చెల్లెలు నాకు నచ్చేసింది నాకిచ్చి పెళ్లి చెయ్యి లేదంటే ఎవరితోనూ పెళ్లి కాకుండా చేస్తాను అనడంతో ఏసిపి కి బసవకి గొడవ అవుతుంది.అన్నట్లుగానే మైథిలి కి పెళ్లి జరుగుతున్నప్పుడే బసవ మనుషులు పెళ్ళికొడుకుని చంపేస్తారు.ఆ తర్వాత మైథిలికి ఎవరికి సంబంధం కుదిర్చినా వారిని చంపేస్తుంటాడు బసవ. బసవను ఏమి చేయలేక పోయిన ఏసిపి మైథిలి ని తన ఫ్యామిలీతో పాటు రహస్య ప్రదేశానికి పంపిచ్చేస్తాడు. ఆ తర్వాత బసవ మైథిలి కోసం వెతకడం, మైథిలి స్కంద అనే కుర్రాడి ప్రేమలో పడడం, చివరకు స్కంద మైథిలి ని బసవ నుంచి ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ. విశ్లేషణ: ఈ మధ్య కాలంలో తేజ ఏ ఇంటర్వ్యూ లో చూసినా టాలీవుడ్ లో కొత్త కథలు రావడంలేదు, రెండే కథలు నడుస్తున్నాయి కావాలంటే మీరే చెక్ చేసుకోండి అని కాస్త ఘాటుగానే మాట్లాడాడు. దీంతో హోరా హోరీ చిత్రం మాములుగా ఉండదేమో, అదిరిపోద్దేమో, బ్లాక్ బస్టర్ హిట్టేమో అనుకున్న ప్రేక్షకులకు తేజ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. సూపర్ డూపర్ బ్లాక్ బస్తర్ ఫ్లాప్ తో ప్రేక్షకుల బుర్రలను బద్దలు కొట్టాడు. ఫ్లాపుల్లో అయన రికార్డులను ఆయనే బ్రేక్ చేసిపడేసాడు. దీంతో తేజ కెరీర్లోనే హోరా హోరీ చిత్రం బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిపోయే పరిస్థితులు వచ్చేసాయి. కొత్త కథలతో సినిమాలు తీయలేరా అని అందర్నీ విమర్శించిన తేజ తన పాత సినిమాలన్నింటిని కలిపేసి, తనకు అచ్చొచ్చిన తనకు మాత్రమే తెలిసిన తను మాత్రమే తీయగలిగిన ఓ పాత చింతకాయ పచ్చడి కథ తో హోరా హోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథ పాతదే అయినా కనీసం కథనం తో ఆకట్టుకునే ప్రయత్నం కాస్త కుడా చేయలేదు. కనీసం తన పాత సినిమాల్లో అయితే కాస్త ఎమోషన్లు, బలమైన పాత్రలు, ప్రేక్షకులను మెప్పించాయి. కానీ ఈ హోరా హోరీ చిత్రం లో మాత్రం కథ కథనాల దగ్గర్నుంచి పాత్రలు వాటి తీరు తెన్నుల వరకు ఒక గమ్యం లేకుండా బ్రేకులు ఫెయిల్ అయిన ఆయిల్ లారీలా ప్రేక్షకుల మీద సవారి చేసాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే ఒక్క హీరొయిన్ దీక్ష తప్ప మిగిలిన పాత్రలన్నీ తమ ఓవర్ యాక్షన్ తో ప్రేక్షకుల నెత్తిమీద సుత్తి తీసుకుని టపీ టపీ మని ఒకటే బాదుడు. ముఖ్యంగా హాస్యం పేరుతో జబర్దస్త్ గ్యాంగ్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఆల్రెడీ పెనం మీద మాడిన కోడిని తీసుకెళ్ళి తండూరిలో వేసినట్టు వీళ్ళ పంచులు, కుళ్ళు కామెడీ తో ప్రేక్షకులకు చుక్కలు చూపించారు.ఇక హీరో దిలీప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ఏడుస్తూనే ఉంటాడు. ఇలా అయిన దానికి కానీ దానికి హీరో ఏడవడం అనేది దర్శకుడి సరికొత్త క్రియేటివిటీ అనుకోవాలో లేక హీరోకి అది మాత్రమే తెలుసనుకొవాలొ ప్రేక్షకులకే వదిలేస్తున్నాము. తేజ హీరోలందరిలో ఇతను మాత్రమే వీక్ అండ్ పూర్ పెర్ఫార్మన్స్ కలిగిన హీరో. ఒక్క హీరోయిన్ దక్ష మాత్రమే తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఇక మిగిలిన టెక్నికల్ అంశాల్లోకి వెళ్తే దీపక్ భగవంత్ అందించిన సినిమాటోగ్రఫి అధ్బుతం. సరికొత్త లొకేషన్లను వర్షం పడే సన్నివేశాలను దీపక్ చాల చక్కగా చూపించాడు. అలాగే కళ్యాణి కోడూరి అందించిన సంగీతం కానీ, దామోదర్ ప్రసాద్ నిర్మాణ విలువలు కానీ పర్వలేదనిపిస్తాయి. కానీ ఇవి ఎంత బాగున్నా సరైన కథ కథనం లేనప్పుడు హోరా హోరిన పడిన కష్టమంతా వృధా ప్రయాస అవుతుంది. తన పాత సినిమానే తీసుకుని రెండున్నర గంట సేపు నత్త నడకన సాగిస్తూ.. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తూ.. తీసిందే మళ్లీ మళ్లీ చూపిస్తూ ఉంటె ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించండి.సో ఫైనల్ గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రోజుల తర్వాత తేజ హోరా హోరిన చాల కస్టపడి ఓ దిసాస్తర్ ఫ్లాప్ ని ప్రేక్షకులకు అందించాడు. ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫి లొకేషన్స్ మైనస్ పాయింట్స్ కథ కథనం దర్శకత్వం హీరో కామెడీ ఎమోషన్స్ పాత్రల చిత్రీకరణ టెన్ టివి రేటింగ్...
--మాగల్ఫ్.కామ్ రేటింగ్ 3/5
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









