కొత్త లేబర్ చట్టం త్వరలో: ఒమన్ మినిస్టర్
- January 16, 2017
మస్కట్: రానున్న కొద్ది కాలంలో కొత్త లేబర్ చట్టం వచ్చే అవకాశాలున్నట్లు మినిస్టర్ ఆఫ్ మేన్ పవర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ అల్ బక్రి చెప్పారు. కొత్త చట్టం అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉందనీ, వీలైనంత త్వరగా అది అమల్లోకి రావొచ్చునని తాను భావిస్తున్నట్లు చెప్పారాయన. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టంలో నిబంధనలు ఉంటాయని తెలిపారాయన. మజ్లిస్ అల్ షురా సమావేశంలో ఒమనీయులకు ఉద్యోగాలపై చర్చ జరిగిన సందర్భంగా ఈ అంశం తెరపైకి వచ్చింది. 228,070 మంది ఒమనీయులు పలు ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నారనీ, ఈ రంగంలోని మొత్తం ఉద్యోగుల్లో 11.7 శాతంగా వీరు ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు మినిస్టర్. మినిస్ట్రీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ద్వారా ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారాయన. అల్ దఖిలియా గవర్నరేట్ పరిధిలో అత్యధిక శాతం, అనగా 24 శాతం ఒమనైజేషన్ ఉంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఎక్కువగా స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చేయడం కోసం కొత్త చట్టంలో అనేక నిబంధనలు ఉంటాయని సమాచారమ్. ప్రైవేటు రంగంతో పోల్చితే ఒమనీయులు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలపై మొగ్గు చూపుతున్నట్లు మినిస్టర్ షేక్ అబ్దుల్లా చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







