టొమాటో వెర్మిసెల్లి సూప్..
- January 16, 2017
కావలసినవి: టొమాటో ముక్కలు - ముప్పావు కప్పు, వెర్మిసెల్లి - పావుకప్పు (చిన్న ముక్కలుగా చేసి), నూనె - ఒక టేబుల్స్పూన, వెల్లుల్లి ముక్కలు - రెండు టీస్పూన్లు, ఉల్లి ముక్కలు (సన్నగా తరిగినవి) - రెండు టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ (గుజ్జు) - ఒక టేబుల్ స్పూన, వెజిటబుల్ స్టాక్ - మూడు కప్పులు, ఉప్పు - రుచికి సరిపడా, మీగడ, ఒక టేబుల్ స్పూన్.
తయారీ: వెడల్పాటి నాన స్టిక్ పానలో నూనె వేడిచేయాలి. అందులో వెల్లుల్లి, ఉల్లి ముక్కలు వేసి ఓ మాదిరి మంట మీద రెండు నిమిషాలు వేగించాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేగించాలి. టొమాటో గుజ్జు, వెజిటబుల్ స్టాక్ వేసి మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ మరో మూడు నిమిషాలు ఉడికించాలి. పానని స్టవ్ మీద నుంచి దింపి చల్లారనివ్వాలి. బాగా చల్లారాక మిశ్రమాన్ని మిక్సీజార్లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పానలో వేసి అందులో వెర్మిసెల్లి, ఉప్పు, మిరియాలు వేసి కలపాలి. ఓ మాదిరి మంట మీద మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. లేదా వెర్మిసెల్లి మెత్తబడేవరకు ఉంచాలి. తరువాత మీగడ వేసి వేడివేడిగా తాగేయాలి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!







