యూఎస్ కాంగ్రెస్‌లో భారతీయ అమెరికన్లకు ముఖ్యమైన బాధ్యతలు..
- January 16, 2017
అమెరికా చట్టసభలకు ఎన్నికైన అయిదుగురు భారతీయ అమెరికన్లకు కీలక కమిటీల్లో స్థానం లభించింది. యూఎస్ కాంగ్రెస్‌లో ఒకేసారి ఇంతమంది భారతీయ అమెరికన్లకు ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించే అవకాశం రావటం ఇదే తొలిసారి. సిలికాన్ వ్యాలీ నుంచి ఎన్నికైన ఆర్వో ఖన్నా.. కీలకమైన బడ్జెట్ కమిటీకి ఎంపికయ్యారు. సియాటిల్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన ప్రమీలా జయపాల్.. న్యాయ కమిటీలో స్థానం దక్కించుకున్నారు. షికాగో పశ్చిమ, వాయువ్య శివార్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజా కృష్ణమూర్తి... విద్య, కార్మికశక్తి కమిటీకి ఎంపికయ్యారు. మూడు దఫాలుగా ప్రతినిధుల సభకు ఎన్నికవుతూ వస్తున్న అమి బెరా...
విదేశీ వ్యవహారాలు; సైన్స్-స్పేస్-టెక్నాలజీ కమిటీలకు తిరిగి ఎంపికయ్యారు. యూఎస్ సెనెట్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళ.. కమలా హారిస్ ఏకంగా నాలుగు కమిటీల్లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బడ్జెట్, పర్యావరణం, ప్రజాపనులు, అంతర్గత భద్రత, ప్రభుత్వ వ్యవహారాల కమిటీలతో పాటు నిఘా విభాగం ఎంపిక కమిటీలో ఆమె సభ్యురాలుగా నియమితులయ్యారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







