యాక్షన కింగ్ అర్జున విలనగా..
- January 16, 2017
నితిన్ హీరోగా వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైనమెంట్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మాతలు. ఈ సినిమాలో యాక్షన కింగ్ అర్జున విలనగా నటిస్తున్నారు. అనిల్ సుంకర మాట్లాడుతూ ''అర్జునగారు ఇందులో స్పెషల్ కేరక్టర్ చేస్తున్నారు. హను కథ చెప్పగానే ఈ పాత్రకు ఎవరైనా సరిపోతారా? అని మూడు నెలలు డిస్కస్ చేశాం. అందరం కలిసి అర్జునగారి పేరు అనుకున్నాం. అయితే ఆయన చేస్తారా? లేదా? అనే సంశయం కలిగింది. కానీ ఆయన వినగానే ఒప్పుకోవడం ఆనందంగా ఉంది'' అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ''నేను చిన్నతనం నుంచి యాక్షన్ సినిమాలు బాగా చూసేవాడిని.
అర్జునగారి జెంటిల్‌మేన చిత్రాన్ని స్కూలు ఎగ్గొట్టి మరీ వరుసగా మూడు రోజులు చూశాను. ఆయన ప్రతి సినిమా కథా నాకు గుర్తుంది. ఇందులో ఆయన విలనగా నటిస్తున్నారు. ఆ పాత్రతోనే సినిమా మొదలవుతుంది.
ఆయన కథ విని చేస్తాననగానే సచిన టెండుల్కర్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎంత ఆనందపడ్డాడో అంత సంతోషపడ్డాను'' అని అన్నారు. అర్జున మాట్లాడుతూ ''నటనకి అవకాశం ఉన్న పాత్ర దొరికినప్పుడు ఎవరైనా ఎగ్జయిట్ అవుతారు. హను చెప్పిన కథ నచ్చింది మూడు దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నాను. ప్రతి చిత్రంతోనూ నేను ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉన్నాను.
గత రెండు నెలల్లో దాదాపు పాతిక స్ర్కిప్ట్‌లు విన్నాను. ఈ కథ సోఫిస్టికేటెడ్‌గా, ఇంటలిజెంట్‌గా అనిపించింది'' అని అన్నారు. నిర్మాత గోపీచంద్ ఆచంట మాట్లాడుతూ ''ఈ చిత్రాన్ని జనవరి 6న ప్రారంభించాం. రేపటి నుంచి షెడ్యూల్ మొదలవుతుంది.
ఫిబ్రవరి వరకు ఇక్కడ తెరకెక్కిస్తాం. మార్చి నుంచి మే వరకు 60 రోజుల పాటు అమెరికాలో షెడ్యూల్ ఉంటుంది. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. అర్జునగారు చేస్తున్న విలన పాత్ర అందరికీ తప్పక నచ్చుతుంది'' అని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







