విజిట్ వీసాతో వచ్చి బహ్రెయిన్‌లో మృతిచెందిన మహిళ..
- January 16, 2017
65 ఏళ్ళ మహిళ ఒకరు బహ్రెయిన్‌కి విజిట్ వీసాపైన వచ్చి, గుండెపోటుతో మరణించారు. భారతదేశంలోని కేరళకు చెందిన 65 ఏళ్ళ శారద శంకర్, అద్లియాలో తన కుమారుడు నివాసం ఉంటున్న అకామడేషన్‌కి వచ్చారు. దురదృష్టవశాత్తూ ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతురాలి ఇద్దరి కుమారులు సుధీష్ కుమార్, సురేష్‌బాబు బహ్రెయిన్‌లోనే ఉన్నారు. ఆమెకు మొత్తం ఐదుగురు సంతానం. స్నేహితురాలు నారాయణితో కలిసి బహ్రెయిన్‌కి వచ్చారు శారద. పాస్‌పోర్ట్ సమస్యలతో ఆమె తిరుగు ప్రయాణం కాస్త ఆలస్యమవగా, ఇంతలోనే ఆమెను మృత్యువు వెంటాడింది. డిసెంబర్ 26న నారాయణి బహ్రెయిన్‌కి రాగా, జనవరి 13న శారద బహ్రెయిన్‌కి చేరుకున్నారు. నారాయణి, శారద ఇద్దరూ సుధీష్కుమార్ ఫ్లాట్‌లోనే ఉండేవారు. టీవీ చూస్తుండగా, గుండెపోటు రావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. సలామియా మెడికల్ కాంప్లెక్స్ మార్చురీలో శారద మృతదేహాన్ని భద్రపరిచారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







