అగ్ని ప్రమాదాల నివారణకు మాల్స్ చర్యలు..
- January 16, 2017
ఖతార్‌లోని ప్రధానమైన మాల్స్ అన్నీ భద్రతా చర్యల్ని మరింత ముమ్మరం చేస్తున్నాయి. అగ్ని ప్రమాదాల్ని అరికట్టేందుకుగాను ఈ చర్యలను చేపడుతున్నారు. మాల్స్‌లో కొలువుదీరుతున్న షాప్స్కి చెందిన యజమానుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు ఎక్కువగా ఆస్కారం కల్పిస్తున్నట్లు మాల్స్ నిర్వాహకులు తెలిపారు. ఈ కారణంగా తలెత్తుతున్న సమస్యల్ని అధిగమించేందుకోసం ఎప్పటికప్పుడు తనిఖీల్ని ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు వారు వివరించారు. ప్రధానంగా ఎక్స్టెన్షన్ కార్డ్స్ ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పవర్ కేబుల్స్ నిర్వహణలో ఏమాత్రం అసత్వం ప్రదర్శించినా భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయని దార్ అల్ సలామ్ షాపింగ్ మాల్ ఆపరేషన్స్ మేనేజర్ జాహిద్ ఇక్బాల్ చెప్పారు. 43 పాయింట్ ఇన్స్పెక్షన్ విధానం ద్వారా ప్రమాదాల నిర్వహణ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇంకొందరు మాల్ నిర్వాహకులు వివరించారు. వినియోగదారుల రక్షణే తమ తక్షణ కర్తవ్యమని అల్ ఖోర్ మాల్ నిర్వాహకులు చెప్పారు. మాల్ మేనేజర్ నవ్‌నీత్ సుధాకరణ్ మాట్లాడుతూ, మాల్లో షాప్స్ నిర్వహిస్తున్నవారంతా తగిన జాగ్రత్తలు తీసుకునేలా వారిలో అవగాహనా కార్యక్రమాలు కల్పిస్తున్నామన్నారు. ఇంకో వైపున మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, నివాసితులు ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







