విజయవాడ బ్రాండ్ అంబాసిడర్‌గా కోనేరు హంపి..
- January 16, 2017
స్వచ్ఛ సర్వేక్షణ్కు విజయవాడ బ్రాండ్ అంబాసిడర్‌గా 'చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపిని ఎంపిక చేసినట్టు మేయర్ కోనేరు శ్రీధర్ తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ హెల్ప్‌లైన నుంచి వచ్చే ఫోన్ ద్వారా అమితాబ్ ప్రసంగం వినిపిస్తుందని, నగర సంబంధిత స్వచ్ఛతా యాప్ ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడంలో భాగంగా హంపి ప్రసంగం ఉంటుందని తెలిపారు. సోమవారం ఆయన తన చాంబర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయవాడ బ్రాండ్ అంబాసిడర్‌గా తన సేవలను అందించేందుకు అంగీకరించిన హంపికి కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2017 కార్యక్రమానికి నగర ప్రజలందరూ సహకరించాలని కోరారు.
జనవరి 17 నుంచి 19వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ బృందం నగరంలో పర్యటిస్తుందన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ తదితర ప్రాంతాలను బృంద సభ్యులు పరిశీలిస్తారని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధిపై నగర ప్రజల అభిప్రాయాలు సేకరిస్తారని పేర్కొన్నారు. గత సంవత్సరం 'స్వచ్ఛ సర్వేక్షణ్' కార్యక్రమంలో మైసూరు మొదటిస్థానంలో నిలువగా విజయవాడ 23వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని మేయర్ గుర్తుచేశారు. ఈ ఏడాది నగరాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమం అనంతరం కోనేరు హంపిని మేయర్ శాలువా కప్పి గౌరవించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ, అదనపు మునిసిపల్ కమిషనర్ (జనరల్) పి.అరుణ్‌బాబు, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గోపీనాయక్ పాల్గొన్నారు.
రెండేళ్ల నుంచి 'స్వచ్ఛభారత్'లో పాల్గొంటున్నా..
రెండేళ్ల నుంచి 'స్వచ్ఛ భారత' కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. చల్లపల్లి, అవనిగడ్డలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. విజయవాడకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసేందుకు సిద్ధమయ్యాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్ఫూర్తితో కార్యక్రమాల్లో పాల్గొంటున్నానే తప్ప రాజకీయాలపై ఎటువంటి ఆసక్తి లేదు. జనవరి మొదటి వారంలోనే టోర్నమెంట్ పూర్తి చేసుకుని వచ్చాను. తదుపరి షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం 'స్వచ్ఛ సర్వేక్షణ' కార్యక్రమానికి విజయవాడ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతాను.
కోనేరు హంపి, చెస్ గ్రాండ్ మాస్టర్
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







