కొడుకు కోసం...
- January 17, 2017
సం జోష్, హర్షిత జంటగా నటిస్తున్న చిత్రం 'బేవర్స్'. రాజేంద్రప్రసాద్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. రమేష్ చెప్పాల దర్శకుడు. పి.చందు, ఎం.అరవింద్ నిర్మాతలు. ఈ నెలాఖరు నుంచి మొదలయ్యే చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. సంక్రాంతిని సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ''తండ్రీ కొడుకుల కథ ఇది. గెలిచాక అందరూ నమ్ముతారు, కుటుంబం ప్రయత్నాన్ని కూడా నమ్ముతుంది... అనే విషయాన్ని ఈ చిత్రంతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కొడుకు కోసం తండ్రి ఏం చేశాడనేది తెరపైనే చూడాలి.
తండ్రీబిడ్డల బంధం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయ''న్నారు. ''మీ శ్రేయోబిలాషి' చిత్రానికి మాటల రచయితగా పనిచేసిన రమేష్ చెప్పాల, ఓ మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ పాత్ర, ఆయన నటన చాలా బాగుంటుంద''ని నిర్మాతలు తెలిపారు. అభి, మధునందన్, అమృతం వాసు, విజయభాస్కర్, వెంకీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం: చిట్టిబాబు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







