కొడుకు కోసం...

- January 17, 2017 , by Maagulf
కొడుకు కోసం...

సం జోష్‌, హర్షిత జంటగా నటిస్తున్న చిత్రం 'బేవర్స్‌'. రాజేంద్రప్రసాద్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. రమేష్‌ చెప్పాల దర్శకుడు. పి.చందు, ఎం.అరవింద్‌ నిర్మాతలు. ఈ నెలాఖరు నుంచి మొదలయ్యే చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. సంక్రాంతిని సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ''తండ్రీ కొడుకుల కథ ఇది. గెలిచాక అందరూ నమ్ముతారు, కుటుంబం ప్రయత్నాన్ని కూడా నమ్ముతుంది... అనే విషయాన్ని ఈ చిత్రంతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కొడుకు కోసం తండ్రి ఏం చేశాడనేది తెరపైనే చూడాలి.

తండ్రీబిడ్డల బంధం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయ''న్నారు. ''మీ శ్రేయోబిలాషి' చిత్రానికి మాటల రచయితగా పనిచేసిన రమేష్‌ చెప్పాల, ఓ మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌ పాత్ర, ఆయన నటన చాలా బాగుంటుంద''ని నిర్మాతలు తెలిపారు. అభి, మధునందన్‌, అమృతం వాసు, విజయభాస్కర్‌, వెంకీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, ఛాయాగ్రహణం: చిట్టిబాబు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com