తెలుగు కళా స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన 'సంక్రాంతి సంబరాలు'
- January 17, 2017
మన ఇంటికి, మన ఊరికి, దేశానికి దూరంగా 'అబుధాబి' లో మన తెలుగు వారు 'తెలుగు కళా స్రవంతి ' ఆధ్వర్యంలో సంయుక్తంగా కలిసి నిర్వహించిన ఈనాటి కార్యక్రమం 'సంక్రాంతి సంబరాలు'.
ఈ కార్యక్రమంలో 'మన తెలుగు బడి' చిన్నారులు ఆలపించిన తెలుగు శ్లోకాలతో పాటు
సంక్రాంతి నృత్యరూపకం తెలుగువారైన మనల్ని మంత్రముగ్ధులను చేస్తూ, భోగి రోజున
పిల్లల్ని ఆశీర్వదిస్తూ చేసే ముచ్చటైన 'భోగి పళ్ళ' వేడుక తో పాటు, అదే విధంగా మన ఆడపడుచుల రంగు రంగుల రంగవల్లులు,గొబ్బెమ్మల ఆటలతో, పురుషుల విభాగంలో ఆసక్తికరంగా సాగే పలు ఆటలు చిన్నారుల ముచ్చట గొలిపే ఆటలు నిర్వహించటం జరిగింది.
మన తెలుగు సాంప్రదాయక మనదైన పసందైన తెలుగు రుచులతో వినువిందుగా కనువిందుగా సంక్రాంతి సంబరాన్ని తెలుగువారందరూ కలిసి జరుపుకున్నారు.అలాగే మన అనుబంధ సంస్థలైన 'సంస్కృతి','వనిత','తెలుగు బడి' వారందరూ కలిసి సంయుక్తంగా విజయవంతం చేశారు.









తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







