ఫిబ్రవరి 17న విడుదలకు సిద్ధమవుతున్న`కిట్టు ఉన్నాడు జాగ్రత్త`
- January 17, 2017
యంగ్ హీరో రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై దొంగాట ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`. ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ను ఫిబ్రవరి 17న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 2016లో హిట్ అయిన చిత్రాల్లో ఈడోరకం-ఆడోరకం సినిమా తర్వాత ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రాజ్తరుణ్ నటిస్తున్న మరో చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.
ఈ చిత్రంలో రాజ్తరుణ్ కుక్కలను కిడ్నాప్ చేసే యువకుడిగా పాత్రలో కనపడనున్నారు. డబ్బు కోసం కుక్కలను కిడ్నాప్ చేయడమే కాకుండా, ప్రేమ కోసం రాజ్తరుణ్ ఏం చేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అనేక మలుపులతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సినిమా ఆసక్తికరంగా సాగుతుందని నిర్మాత రామ బ్రహ్మం సుంకర తెలియజేశారు.
గౌతమిపుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ సినిమాకు సంభాషణలు రాసిన రైటర్ సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు ఫన్నీ డైలాగ్స్ను అందించారు. రాజ్తరుణ్ సరసన అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహిస్తున్నారు.
రాజ్తరుణ్, అను ఇమ్మాన్యుయల్, పృథ్వీ, రఘుబాబు, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్, ప్రవీణ్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథః శ్రీకాంత్ విస్సా, డైలాగ్స్ః సాయిమాధవ్ బుర్రా, ఎడిటర్ః ఎం.ఆర్.వర్మ, ఆర్ట్ః అవినాష్, కెమెరాః బి.రాజశేఖర్, సహ నిర్మాతః అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః కిషోర్ గరికపాటి, మ్యూజిక్ః అనూప్ రూబెన్స్, నిర్మాతః రామబ్రహ్మం సుంకర, దర్శకత్వంః వంశీకృష్ణ
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







