ఏపీలో పెరగనున్న కరెంట్ చార్జీలు.!
- January 18, 2017
ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రాప్రజలకు షాక్ ఇవ్వాలని డిసైడయ్యారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఆంధ్రాలో కరెంట్ చార్జీలు పెంచాలని నిర్ణయించేశారు. ఛార్జీలు పెంపు కోసం ఇప్పటికే డిస్కంలు ప్రపోజల్స్ రెడీ చేశాయి. తాజాగా చంద్రబాబు కూడా చార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. చంద్రబాబు ప్రస్తుతం దావోస్ సదస్సులో ఉన్నా.. చార్జీల పెంపుపై ఏపీ అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది. దాదాపు 850 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఛార్జీలు వడ్డించేందుకు రెడీ అవుతున్నారట. ఓవరాల్ గా ఛార్జీల పెంపు 4 నుంచి 5 శాతం మధ్యన ఉండొచ్చట. డిస్కంల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఉదయ్ ఒప్పందలో సైతం 5శాతం ఛార్జీల పెంపు ఉంటుందని ఏపీ ఇప్పటికే ప్రతిపాదించింది కూడా.
అటు పరిశ్రమలకు ఎంతమేర చార్జీలు పెంచాలన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పరిశ్రమలకు ఎక్కువగా పెంచితే వారు.. బహిరంగ మార్కెట్లో కరెంటు కొనుక్కుంటేరేమో అన్న భయం ఏపీ గవర్నమెంట్కు కనిపిస్తోంది. ప్రస్తుతం గృహావసరాలు, పరిశ్రమలకు నెలకు 55.12 రూపాయల చొప్పున స్థిర ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఐతే.. ఈ విద్యుత్ చార్జీల పెంపును రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఈ చార్జీల పెంపును వైసీపీ వంటి పార్టీలు అందిపుచ్చుకునే అవకాశం పుష్కలంగా ఉంది. వైఎస్ హయాంలో ఒక్కసారి కూడా చార్జీలు పెంచకపోవడాన్ని జగన్ గుర్తు చేస్తూ జనంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. మరి దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







