రెండో రౌండ్‌కు చేరుకున్న సానియా, బోపన్న జోడీలు
- January 18, 2017
ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత టెన్నిస్ క్రీడాకారులు శుభారంభం చేశారు. తమ భాగస్వాములతో కలిసి సానియా మీర్జా, రోహన్ బోపన్న విజయాలు సాధించారు. మహిళల డబుల్స్ తొలిరౌండ్లో సానియా, స్ట్రికోవా (చెక్) జోడీ 6-3, 6-1తో బ్రిటిష్ ద్వయం జాస్లిన్ , అన్నా స్మిత్‌ను చిత్తుచేసింది. తొలి సెట్‌లో బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడ్డ సానియా జంట రెండో సెట్లో పూర్తిగా దూకుడుగా ఆడింది.
రెండో రౌండ్‌కు బోపన్న
పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న, పాబ్లో క్యూవస్ (ఉరుగ్వే) జోడీరెండో రౌండ్‌కు చేరుకొంది. తొలిరౌండ్లో థామస్ బెల్లూసీ (బ్రెజిల్), మాక్సిమో గొంజాలెజ్ (అర్జెంటీనా) ద్వయాన్ని 6-4, 7-6(4) తేడాతో వరుస సెట్లలో మట్టికరిపించింది. పురవ్‌రాజా, దివిజ్ శరణ్ జోడీ తొలి రౌండ్లో ఫ్రెంచ్ ద్వయం జొనాథన్ ఎస్సెరిక్, ఫాబ్రిస్ మార్టిన్‌తో, లియాండర్ పేస్, ఆండ్రూ సా జోడీ ట్రీట్ హుయె, మాక్స్ మిర్నీ ద్వయంతో తలపడనుంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







