పొరపాటున శరణార్థుల శిబిరంపై బాంబుదాడి, 100 మంది మృతి
- January 18, 2017
నైజీరియా: ఉగ్రవాదులపై వేయాల్సిన బాంబును పొరపాటున శరణార్థుల శిబిరంపై వేయడంతో 100 మందికి పైగా మృతి చెందిన ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. కామెరూన్ సరిహద్దు సమీపంలోని రాన్ ప్రాంతంలో.. బోకోహారమ్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్న ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ విమానం శరణార్థుల శిబిరంపై బాంబు జారవీడిచినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనను నైజీరియా మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లక్కీ ఇరాబొర్ ధృవీకరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని బోర్నో స్టేట్ గవర్నమెంట్ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాధితుల్లో శరణార్థులతో పాటు శిబిరంలో సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేషన్స్ వితౌట్ బార్డర్స్, రెడ్ క్రాస్ సంస్థల సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







