భూకంపం ఇటలీలో...

- January 18, 2017 , by Maagulf
భూకంపం ఇటలీలో...

- రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 5.3గా నమోదు 
రోమ్‌ : మధ్య ఇటలీలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.3గా నమోదైందని యూఎస్‌ జియోలజికల్‌ సర్వే అధికారులు తెలిపారు. అమాట్రీస్‌ నగరానికి 7కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు చెప్పారు. భూకంప ప్రభావంతో అబ్రూజో, మార్చే, లాజియో, రోమ్‌ నగరాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే, అదృష్టవశాత్తూ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు అన్నారు.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఇదిలా ఉండగా, గతేడాది ఆగస్టులో అమాట్రీస్‌ నగరంలో భారీ భూకంపం సంభవించింది.
భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.1గా నమోదైంది. ఈ దుర్ఘటలో 297 మంది మృతి చెందారు. 
జపాన్‌లోనూ... 
సెంట్రల్‌ జపాన్‌లో బుధవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.2గా నమోదైందని స్థానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇబారకీ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు చెప్పారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com