అబుదాబీ హైవేస్‌పై మరిన్ని రాడార్లు
- January 19, 2017
అబుదాబీ హైవేల మీద మరికొన్ని రాడార్లను ఏర్పాటు చేయనున్నారు. రోడ్లపై వాహనాల తీరుని పరిశీలించడం అలాగే ప్రమాదాల్ని నిలువరించడం అనే ఉద్దేశ్యాలతో ఈ రాడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు అబుదాబీ పోలీసులు చెప్పారు. అబుదాబీ - అల్ సిలా రోడ్ అలాగే అబుదాబీ -అల్ అయిన్ రోడ్లపై కొత్తగా రాడార్లను ఏర్పాటు చేస్తారు. ఈ రాడార్లకు సంబంధించి తమ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల్ని వాహనదారులు చెక్ చేసుకోవచ్చని ట్రాఫిక్ అధికారులు వివరించారు. వాహనాల వేగ పరిమితిపై ప్రస్తుతం ఉన్న నిబంధనలే కొనసాగుతాయనీ, వీటిల్లో ఎలాంటి మార్పులు లేవని వారు తెలిపారు. వాహనదారులు రోడ్లపై అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాల నివారణకు తోడ్పడాలని పౌరులకు ట్రాఫిక్ అధికారులు సూచించారు. బ్రిగేడియర్ జనల్ అల్ సెహ్హి మాట్లాడుతూ రోడ్లపై గంటకు 100 కిలోమీటర్ల వేగ పరిమితి ఉందని, గ్రేస్ పీరియడ్ 121 కిలోమీటర్ల దాకా ఉందని చెప్పారు. కొన్ని రోడ్లపై 120 కిలోమీటర్ల వేగం, గ్రేస్ పీరియడ్ 141గా నిర్ణయించారు. కొన్ని వాహనాలకు 80 కిలోమీటర్ల వేగానికే పరిమితి విధించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







