కమల్‌కి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రధానం చేసిన రజనీకాంత్

- January 19, 2017 , by Maagulf
కమల్‌కి  లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రధానం చేసిన రజనీకాంత్

రజనీకాంత్ , కమల్ కలిసి 30 ఏళ్ల తర్వాత ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. 'వికటన్' అవార్డ్ ఫంక్షన్‌లో రజనీకాంత్ ,కమల్‌కి  లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫొటోషూట్‌లో ఈ ఇద్దరు హీరోస్ కలసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చేరడంతో రజనీ, కమల్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కాగా ఈ టాప్ హీరోస్ కలిసి, రెండు తెలుగు, ఒక హిందీ, 9 తమిళ ఫిల్మ్‌స్‌లో నటించారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరు కలిసి మెరిసిన ఈ ఫొటోలు అభిమానులకు కనులవిందుగా మారాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com