సీబీఐ చీఫ్‌గా ఢిల్లీ పోలీస్ చీఫ్ అలోక్ కుమార్ వర్మ
- January 19, 2017
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చీఫ్‌గా ఢిల్లీ పోలీస్ చీఫ్ అలోక్‌కుమార్‌వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వర్మ అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం ప్రాంతాల్లో పనిచేశారు. తిహార్ జైలు డీజీగా కూడా ఆయన పనిచేశారు.
డిసెంబరు 2న అనిల్ సిన్హా పదవీ విరమణ చేయడంతోఅప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ ఆస్థానా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సీబీఐ డైరెక్టర్ రేసులో 45 మంది ఐపీఎస్ అధికారుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. వీరిలో కృష్ణ చౌదరి, అరుణా బహుగుణ, ఎస్.సి, మాధుర్ పేర్లు బాగా ప్రచారంలోకి వినిపించాయి. సీబీఐ డైరెక్టర్ ఎంపికపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినప్పటికీ, నిర్ణయాన్ని మాత్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







