కువైట్ లో ఘనంగా జరిగిన N.T.R వర్ధంతి
- January 20, 2017
కువైట్ లోని ఫర్వానియాలోని SVS. ఆఫిస్ ప్రాంగాణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 21 వ వర్ధంతి తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు శ్రీ కుదరవల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కువైట్ లోని తెలుగు ప్రజలు భారీగా హాజరయి NTR కి నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా ఏర్పాటుచేసిన వర్ధంతి సభలో ఆ పార్టీ నాయకులు NTR తెలుగుజాతికి చేసిన సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్ రావు గారు మాట్లాడుతూ NTR తెలుగు వారి కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ,తెలుగు జాతి కోసం ఆయన చేసిన సేవలను చూసి స్ఫూర్తి పొంది తానుకుడా తనవంతు సహాయంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి మృతదేహాలను స్వస్ధలాలకు చేర్చుటకు చెన్నై, విజయవాడ, హైదరాబాద్ విమానాశ్రయాల నుండి ఉచితంగా అంబులెన్స్ ను బహుకరించానని అలాగే NTR MODEL స్కూల్ లో కొంతమంది అనాధపిల్లలను చదివిస్తున్నాని అలాగే కువైట్ లోని ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించి ఇండియన్ ఎంబస్సి వారి సహకారంతో తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో SVS CARGO అధినేత మరియు కోశాధికారి రమేశ్ నాయుడు ,సోషల్ వెల్ఫేర్ కో.ఆర్డినేటర్స్ జిలకర మురారి మరియు రవిరాజు మైనార్టీ నాయకులు ముస్తాక్, షేక్ జిలాన్, చోటు మరియు గౌరవ సలహాదారులు కాపెర్ల పట్టాభినాయుడు ,ఖైతాన్ బాబు అధికార ప్రతినిది వెంకట సుబ్బారెడ్డి , P.R.O ఈశ్వర్ నాయుడు, కమీటీ సభ్యుడు సుబ్రమణ్యం,మన కడప సేవాసమితి అధ్యక్షులు సుబ్బారావు, కాపు కమీటీ సభ్యులు మలిశెట్టి పెంచులయ్య , , యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి జిలకర మురళి యాంకర్ గా వ్యవహరించారు.







తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







