నైజీరియాలో సంపూర్ణేష్ బాబు...
- January 21, 2017
సంపూర్ణేష్ బాబు మరో రికార్డు బద్దలు కొట్టడానికి రెడీ ఉన్నాడు. నైజీరియాలో సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట ఫిల్మ్ రిలీజ్ చేయలనుకుంటున్నాడట. నైజీరియా భాషలో విడుదల అవుతున్న ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అని సంపూర్ణేష్ బాబు తెలిపాడు.
కొబ్బరిమట్ట ఫిల్మ్ తెలుగు, తమిళ, కన్నడ ప్రాంతీయ భాషల్లో రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే నైజీరియా భాషలో కూడా విడుదల చేస్తున్నామని తన సోషల్ మీడియా ద్వారా సంపూర్ణేష్ తెలిపాడు. ఈ చిత్రం డబ్బింగ్ పూర్తైందని, ఈ చిత్రంలో నటించినందుకు తన మనసు ఆనందంతో పులకిస్తోందని, జీవితానికిది చాలని అన్నారు. ‘కొబ్బరి మట్ట’ ను తమిళ, కన్నడ, నైజీరియా భాషల్లోకి అనువదిస్తున్నామని చెప్పడం తనకు సంతోషంగా ఉందన్నారు. ‘‘కొబ్బరి మట్ట’ లేటు అయి ఉండొచ్చు, కానీ లెటేస్ట్ సెన్సేషన్ అవడం ఖాయం. ఇది, నా గుండె గుద్ది చెబుతున్నమాట’ అని సంపూర్ణేష్ బాబు తెలిపాడు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







