హైదరాబాద్ నగరంలోని ధూల్ పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది...
- January 21, 2017
హైదరాబాద్ నగరంలోని ధూల్ పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు ఉదయం నుంచి ధూల్ పేటలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను, నిబంధనలకు విరుధ్దంగా ఉన్న భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో స్థానికులు అధికారుల పై మండిపడుతున్నారు. కూల్చివేతకు నిరసన తెలుపుతూ స్థానికులు అక్కడ గుమిగూడారు. పరిస్థితి చేయిదాటడంతో జీహెచ్ ఎంసీ అధికారులు పోలీసులను రప్పించారు. ఘటనా స్థలికి చేరుకున్నపోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. తమ ప్రాణాలు పోయినా సరే... తమ ఇళ్ల కూల్చివేతను అడ్డుకుంటామని స్థానికులు చెబుతున్నారు. దీంతో, అక్కడి వాతావరణం హీటెక్కింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







