ప్రపంచంలోనే అత్యంత పొడవైన సైకిల్ ట్రాక్‌ను..
- January 22, 2017
హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత పొడవైన సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేసే అవకాశం నగరంలో ఉందని తెలంగాణ ప్రభుత్వ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ త్రివేది అన్నారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ బైస్ల్కి క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ది గ్రేటర్ హైదరాబాద్ సైక్లోథాన్-2ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ సైక్లింగ్‌పై ప్రజలు ఉత్సాహంగా ఉన్నప్పటికీ నగరంలోని రోడ్లు, పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా సైక్లి్‌స్టలు అభద్రతా భావానికి లోనవుతున్నారని అన్నారు. ఈ రోడ్లపై సైకిల్ రైడ్ చేసేందుకు తానే అన్‌సేఫ్‌గా ఫీలవుతానని తెలిపారు. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డు పక్కన 158 కిలోమీటర్ల మేర ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్ ట్రాక్‌ను నిర్మించుకోవచ్చునని వెల్లడించారు.
ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడితే మంచిదని తెలిపారు. ఈ సైక్లోథాన్లో ఆరేళ్ల చిన్నారుల నుంచి 81 సంవత్సరాల వృద్ధుల వరకూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలిండియా బైస్ల్కింగ్ ఫెడరేషన్ బోర్డు చైర్మన్ డీవీ మనోహర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







