భార్యని హింసించిన బహ్రేయినీ వ్యక్తికి జరిమానా..
- January 23, 2017
శారీరకంగా తన భార్యను హింసించిన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక బహ్రేయినీ వ్యక్తికి వ్యతిరేకంగా సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం100 బి డి జరిమానాని జారీ చేసింది. " ఆసుపత్రిలో నాకు వేరే అపాయింట్మెంట్ ఉండటంతో నేను ఇంటికి ఆలస్యంగా రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు, నా భర్త నీవు ఎవరితోనే కలిసి తిరుగుతున్నావని అనుమానంతో కూడిన ఆరోపణలు నాపై ఆరోపిస్తుండటంతో . నేను అవి అబద్ధమని గట్టిగా తిరస్కరించిన సమయంలో, ఆగ్రహంతో ఆయన నన్ను నా తల, చేతిపై అలాగే నా వెనుక భాగంలో నన్ను తీవ్రంగా కొట్టారు. అంతేకాక నన్ను చంపుతానని బెదిరించారు, " ఆ బాధిత మహిళ న్యాయవాదుల ఎదుట ఆరోపించారు. గతంలోను ఆ వ్యక్తి తన భార్యను సామాజిక మాధ్యమాల ద్వారా ఆమెపై పలు పుకార్లు ప్రజల్లోకి వ్యాపింపచేసేందుకు ప్రయత్నించాడు. ఆ మహిళ కీర్తి పై మరక వేయడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. నిందితుడి యొక్క ట్విట్టర్ ఖాతాని పరిశీలించేందుకు పోలీస్ అధికారులు ప్రయత్నించగా అందులో తమ పోలీస్ శాఖ పాలన మరియు పోలీసు అధికారుల తీరుకి వ్యతిరేకంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చూసి వారు విస్తుపోయారు.తమని కించపర్చిన ఆ వ్యక్తిపై ఆగ్రహిస్తూ మరొక కేసుని సైతం దాఖలు చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







