షాకింగ్ వీడియో పోస్ట్ చేసిన కమలహాసన్..
- January 24, 2017
జల్లికట్టు కోసం జరిగిన ఆందోళనలపై చెన్నైలోని స్థానిక న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన వీడియోను సినీ నటుడు కమలహాసన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ పోలీసు ఆటోకు నిప్పంటిస్తున్నట్లు కనిపిస్తోంది. 'ఏంటిది. ఎవరైనా వివరించగలరా' అంటూ కమలహాసన్ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. మెరీనా బీచ్ నుంచి విద్యార్థులను పోలీసులు దౌర్జన్యంగా ఖాళీ చేయించడం మంచిది కాదని, అలాగే విద్యార్థులు కూడా ఇక ఆందోళన విరమించాలని కమల్ నిన్న కోరిన విషయం తెలిసిందే.
జల్లికట్టుపై విధించిన నిషేధాన్ని రద్దు చేయాలని చెన్నై మెరీనా బీచ్‌లో ఆందోళన చేస్తున్న వారిని పోలీసుల ఖాళీ చేయించే ప్రయత్నం చేయడంతో నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.
సోమవారం సాయంత్రం తమిళనాడు శాసనసభ అత్యవసరంగా సమావేశమై ముసాయిదా బిల్లును ఆమోదించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తగ్గాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







