'ఏయిర్ ఏసియా' బంపర్ ఆఫర్
- January 24, 2017
బడ్జెట్ ప్యాసెంజర్ క్యారియర్ ఏయిర్ఏసియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రౌండ్ ట్రిప్పులకు(వెళ్లడం, రావడం) 50 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను అందించనున్నట్టు తెలిపింది. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను ఎంజాయ్ చేయాలంటే కంపెనీ వెబ్సైట్, మొబైల్ ఆధారిత తమ అప్లికేషన్లో టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఏయిర్ఏసియా పేర్కొంది. 2017 జనవరి 23 నుంచి 29 వరకు ఏయిర్ ఏసియా మొబైల్ యాప్ లేదా ఏయిర్ఏసియా.కామ్‌లో ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండనుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణాలకు ఇది వర్తించనుంది. ఏయిర్ఏసియా ఇండియా విమానాలు తిరిగే అన్ని విమానాలకు, అన్ని మార్గాలకు ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. కంపెనీ విమానాలు నడపబోతున్న శ్రీనగర్, బాగ్దోగ్రాలకు ఇది వర్తించనుందని కంపెనీ తెలిపింది. ఫిబ్రవరి 19 నుంచి శ్రీనగర్, బాగ్దోగ్రాలకు ఎయిర్‌లైన్ విమానాలు నడుపనుంది. బెంగళూరు, న్యూఢిల్లీ రెండు హబ్‌లుగా 11 ప్రాంతాలకు ఈ ఎయిర్‌లైన్ తన సర్వీసులను అందిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







