3,000 టన్నులకు పైగా వ్యర్ధాలను బీచ్ ల నుండి తొలగింపు
- January 24, 2017
పర్యావరణానికి మేలు చేసేలా సముద్ర తీరాలలో వ్యర్ధాలను భారీగా శుభ్రపరిచే కార్యక్రమ సమయంలో 3,000 టన్నుల వ్యర్ధాలను విజయవంతంగా బీచ్ ల నుండి తొలగించారు. గత ఏడాది నవంబర్ నెల 20 వ తేదీ నుంచి జనవరి 15 వరకు రెండునెలల పాటు ఈ ప్రక్షాళన కార్యక్రమాలు కొనసాగాయి. అలాగే ఉత్తర దక్షణ సముద్ర తీరాలలో దృష్టి సారించి పేరుకుపోయిన చెత్త చెదారాలను తొలగించబడింది. బీచ్ లను శుభ్రంగా ఉంచడానికి మున్సిపాలిటీ శాఖ మరియు పర్యావరణం యొక్క ప్రణాళిక ప్రకారం గత ఏడాది నవంబర్ 20 న ప్రారంభించారు.ముఖ్యంగా వారాంతాల్లో పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే సందర్శకులు కోసం బీచ్ లను ఆహ్లాదంగా రూపొందించాలని మంత్రిత్వశాఖ నిర్ణయించింది. మున్సిపాలిటీ, పర్యావరణ మంత్రి హెచ్ ఇ మొహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ రుమేహి ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఇటీవల బీచ్ లు, ద్వీపాలు నుండి చమురు శుద్ధి తర్వాత మిగిలిన అవశేషాలను తొలగించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేయడం కోసం మంత్రివర్గ నిర్ణయ సంఖ్య (197) 2016 జారీ చేసింది. పర్యావరణ రక్షణ, ప్రకృతి పరిరక్షణ మరియు వన్యప్రాణుల విభాగం, మత్స్య శాఖ మరియు కతర్ పెట్రోలియం ఇతర విభాగాల సభ్యులు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







