అనురాధ పౌడ్వాల్ పద్మశీ పురస్కారం
- January 25, 2017
న లభై ఏళ్లకు పైగా తన గాత్రంతో అలరిస్తున్న అనురాధ పౌడ్వాల్కు విశిష్ట గౌరవం దక్కింది. ఆమెను పద్మశీ పురస్కారం వరించింది. 16 భాషల్లో వేల గీతాలతో పాటకు పట్టం కట్టిన అనురాధ గాన ప్రస్థానమిదీ.
కర్నాటకకు చెందిన అనురాధ అసలు పేరు అల్కా నందకర్ణి.
21 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ చిత్రం 'అభిమాన్'(1973)తో అనురాధ తొలిసారి తన గొంతు వినిపించింది. అదే ఏడాది మరాఠీ చిత్రసీమకూ పరిచయమైంది. 1976లో శత్రుఘ్న సిన్హా నటించిన 'కాళి చరణ్'తో అనురాధ చిత్రసీమ దృష్టిలో పడింది. అందులోని 'ఏక్ బటా దో.. దో బటే చార్..' గీతం ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. ఎస్.డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, జైదేవ్, కల్యాణ్ జీ ఆనంద్ జీ, బప్పీ లహరి, రాజేష్ రోషన్, ఆనంద్ మిలింద్, నదీమ్ శ్రావణ్, జతిన్ లలిత్, ఎ.ఆర్.రెహమాన్ లాంటి ప్రముఖ సంగీత దర్శకుల సారథ్యంలో అనురాధ ఎన్నో గీతాలతో ఆకట్టుకుంది. ఒక్క హిందీలోనే 5296 పాటలకు పైగా పాడింది. కన్నడ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం, గుజరాతీ, తమిళం, తెలుగు తదితర 16 భాషల్లో వందల పాటలు పాడింది. మరో వైపు ప్రైవేట్ ఆల్బమ్స్, భజన గీతాలు ఆలపించింది. ఆమె కుమార్తె కవితా పౌడ్వాల్ కూడా గాయకురాలిగా కొనసాగుతోంది.
హ్యాట్రిక్ ఫిలింఫేర్: అనురాధ ఆషికి (1990), దిల్ హై కీ మాంతా నహీ (1991), బేటా (1992) చిత్రాలతో వరుసగా మూడు సంవత్సరాలు ఫిలింఫేర్ పురస్కారాలు గెలుచుకుంది. మొత్తం 1989లో 'కలత్ నకలత్'లోని 'ఏక్ రెషామీ..' గీతానికి జాతీయ పురస్కారం గెలుచుకుంది. లతా మంగేష్కర్ తర్వాత డి.లిట్ గౌరవ డిగ్రీని అందుకున్న రెండో గాయకురాలిగా నిలిచింది. 'అభినవ లతా మంగేష్కర్'గా సంగీత దర్శకులతో పిలిపించుకుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







