కువైట్ యువరాజు షేక్ ఫైసల్ అల్ అబ్దుల్లా అల్ సబా మరొక యువరాజు హత్య కేసులో నిందితుడు ...
- January 25, 2017
కువైట్ : కువైట్లో రాజకుటుంబానికి చెందిన వ్యక్తి సహా ఏడుగురికి బుధవారం ఉరిశిక్ష అమలు చేశారు. 40 మందికి పైగా ప్రజలను హతమార్చిన కేసుల్లో నిందితులైన వీరందరికి అంతర్గత వ్యవహారాల శాఖ ఈ మరణ శిక్షలు అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. స్పెషల్ ఫోర్సెస్, ఆరోగ్య మంత్రిత్వశాఖ సమన్వయంతో ఈ ఉరిశిక్షలలో రాజకుటుంబానికి చెందిన ఫైసల్ అబ్దుల్లా అల్ జబర్ అల్ సబా సైతం ఉన్నారు. అక్టోబర్ 2011 లో తన మేనల్లుడు షేక్ బాసెల్ ను హత్య చేసిన కేసులో ఆయన నిందితుడు కావడంతో క్రిమినల్ కోర్ట్ కువైట్ యువరాజు షేక్ ఫైసల్ అల్ అబ్దుల్లా అల్ సబాను దోషిగా తేల్చింది. ఆ తర్వాత ఆయనకు మరణశిక్ష విధించింది.నేరస్థుడు షేక్ ఫైసల్ అబ్దుల్లా ఆల్ జాబెర్, యువరాజు యొక్క మేనమామ, బాధితుడు 20 సంవత్సరాల కన్నా చిన్నవారు. ఆయన కెప్టెన్ హోదాలో సైనిక నిఘా శాఖలో పని చేశారు. చట్టాలను అమలు చేసే విషయంలో తాము కూడా సౌదీకి ఏమాత్రం తీసిపోమని తెలియజేసేలా కువైట్ ప్రభుత్వం ఒకేసారి ఏడుగురికి మరణశిక్షను విధించింది. . గతేడాది సౌదీలో యువరాజుకు మరణశిక్షను విధించినట్లే.. కువైట్లో కూడా రాజవంశీకుడిని బుధవారం ఉరి తీశారు. పలు కేసుల్లో ఉరిశిక్ష పడిన కువైట్, ఇథియోపియన్, ఫిలిప్పీన్ దేశాలకు చెందిన ముగ్గురు మహిళలతో పాటు.. ఈజిప్టుకు చెందిన ఇద్దరు వ్యక్తులు, ఓ బంగ్లాదేశీయుడు, మరో కువైటీని కూడా ఉరితీయనున్నారు. ఈ ఆరుగురితోపాటు రాజకుటుంబానికి చెందిన షేక్ ఫైసల్ అల్ అబ్దుల్లా అల్ షబాహ్ను కూడా ఉరి తీసేరు . కువైట్ ఆర్మీలో కెప్టెన్గా పనిచేసిన షబాహ్..2010వ సంవత్సరం జూన్లో కువైట్ మాజీ ఎమిర్కు చెందిన మసీలాహ్ పాలస్కు వెళ్లాడు. అక్కడ తనకు మేనల్లుడు వరసైన షైక్ బసిల్ను కలిశాడు. అందరినీ బయటకు పొమ్మని చెప్పి.. అతడితో గొవడపడి కాల్పులు జరిపి చంపేశాడు. దీంతో షేక్ ఫైసల్ అల్ అబ్దుల్లా అల్ సబాకు 2011 అక్టోబర్ నెలలో కువైట్ కోర్టు మరణ శిక్షను ఖాయం చేసింది. ఈ ఏడుగురిని బుధవారం కువైట్ కేంద్ర కారాగారంలో ఉరితీయనున్నారు. వీరికి సంబంధించిన బంధువులను.. ఈ ఒక్కరోజు కొన్ని గంటల పాటు కలిసేందుకు వీలిచ్చారు. కొత్త యేడాదిలో మొట్టమొదటి సారి మరణశిక్షను అమలు చేయబోతుండటంతో.. కువైట్లో గంభీర వాతావరణం నెలకొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







