'థాంక్స్ మీట్ ' ...
- January 26, 2017
మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత ఖైదీ నెం 150 తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మెగా అభిమానుల అంచనాలను అందుకున్నాడు.విడుదల మొదటి రోజు నుండే మెగా రికార్డ్స్ బ్రేక్ చేయడం స్టార్ట్ చేసాడు. నాన్ బాహుబలి రికార్డ్స్ సైతం బద్దలు కొట్టి మెగా స్టార్..ఎప్పటికి మెగా స్టారే అనిపించుకున్నాడు. 9 ఏళ్ల తర్వాత కూడా తన ఫై ఎంత అభిమానాన్ని పెట్టుకున్న అభిమానులకు థాంక్స్ చెప్పాలని చిరంజీవి అభిమానుల కోసం 'థాంక్స్ మీట్ ' తో కలవబోతున్నారు.
కొన్ని రోజులుగా ఈ వేడుక వైజాగ్ లేదా హైదరాబాద్ లలో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించినప్పటికీ , చివరకు హైదరాబాద్ లోనే ఈ మెగా థాంక్స్ మీట్ ఏర్పటు చేయాలనీ ఫిక్స్ అయ్యారు.
జనవరి 28న హైదరాబాద్ వేదికగా భారీ ఈవెంట్ ను నిర్వహించేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది. అయితే థ్యాక్స్ మీట్ పై మెగా ఫ్యామిలీ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతం లో ఫ్యాన్స్ కోసం ఏర్పటు చేసిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెద్దగా సక్సెస్ కాకపోయేసరికి , ఈసారి థాంక్స్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించాలని మెగా క్యాంపు భావిస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







