రిపబ్లిక్ డే ఆఫర్ జెట్ ఎయిర్వేస్లో...
- January 26, 2017
న్యూదిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ 'రిపబ్లిక్‌డే సేల్' ఆఫర్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగారూ.999లకే దేశీయ ప్రయాణాలను అందజేయనున్నట్లు వెల్లడించింది. దీనిని బుక్ చేసుకోవాలనుకునే వారి ప్రయాణాలు ఫిబ్రవరి 9, 2017 నాటి నుంచి ఉండాలని షరతు విధించింది. ఈ ఆఫర్ బుకింగ్‌లు జనవరి 25 నుంచి జనవరి 29 మధ్యలో జరిగి ఉండాలి. ప్రయాణానికి కచ్చితంగా 15రోజుల ముందేగా టిక్కెట్లు తీసుకోవాలని పేర్కొంది. ఈ ఆఫర్ కింద అందుబాటులో ఉన్న టిక్కెట్ల సంఖ్యను మాత్రం జెట్‌ఎయిర్‌వేస్ వెల్లడించలేదు. తొలుత బుక్ చేసుకున్న వారికి అధిక ప్రాధాన్యమని ఒక ప్రకటనలో తెలిపింది.
రిపబ్లిక్ డే సేల్ ఆఫర్ కింద అంతర్జాతీయ ప్రయాణాల ప్రీమియర్, ఎకానమీ క్లాస్ రిటర్న్ టిక్కెట్లలో జెట్ ఎయిర్వేస్ 30శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ టిక్కెట్లను జనవరి 25 నుంచి జనవరి 27లోపు బుక్ చేసుకోవాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







