పోలీస్ ను పొడిచిన 16 ఏళ్ళ బాలిక
- January 26, 2017
ఐసిస్ పై సానుభూతితో ఓ బాలిక పోలీసు అధికారిపై దాడి చేసింది. దీంతో ఆ బాలికను పోలీసులు జైల్లో పెట్టారు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకొంది. జర్మనీలోని హనోవర్ ప్రాంతానికి చెందిన సఫియా ఎస్ అనే బాలిక ఐసిస్ ప్రభావానికి గురైంది. ఇస్లామిక్ స్టేట్ భావజాలంతో ఆమె ప్రేరేపితురాలైంది. ఐసిస్ పై సానుభూతితో ఓ పోలీసు అధికారిపై కత్తితో దాడిచేసింది. పోలీసు అధికారిని విచక్షణ రహితంగా పొడిచింది. ఈ బాలిక పోలీస్ అధికారిపై దాడి చేసేందుకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఐసిస్ ను కాపాడేందుకే తాను ఈ పనిచేసినట్టుగా ఆ బాలిక చెప్పినట్టుగా పోలీసులు చెబుతున్నారు. బాలికను అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు ఆరేళ్ళ శిక్ష విధించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







