మే 1 నుంచి రాష్ట్రంలో పాలిథిన్ సంచుల నిషేధం
- January 26, 2017
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ రాష్ట్రంలో పాలిథిన్ సంచులను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మే 1 నుంచి రాష్ట్రంలో పాలిథిన్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆవులు, ప్రకృతిని కాపాడుకోవడానికి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. భోపాల్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ ఓమ్ ప్రకాశ్ కోహ్లీతో కలిసి ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...
పాలిథిన్ సంచుల వాడకం వలన ప్రకృతికి అపారనష్టం వాటిల్లుతోందని, ఆ సంచులను తినడం వలన అధిక సంఖ్యలో ఆవులు మృత్యువాత పడుతున్నాయని తెలిపారు. పాలిథిన్ సంచుల నిషేధంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, మే 1 తర్వాత ఎవరూ వీటిని వాడేందుకు అనుమతి లేదన్నారు. గత సంవత్సవరం జైలు నుంచి తప్పించుకున్న 8మంది సిమీ ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులను సీఎం అభినందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంతో కీలకమైందని, ఈ నిర్ణయానికి తమ రాష్ట్రం కట్టుబడి ఉందన్నారు. మోదీ ప్రభుత్వంలో దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అనంతరం ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలని చౌహాన్ ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







