వివిధ దేశాలకు చెందిన ఏడుగురు ఖైదీలను ఉరి తీసిన కువైట్
- January 26, 2017
కువైట్: ఒకే సారి ఏడుగురికి ఉరిశిక్ష విధించి సంచలనం సృష్టించింది కువైట్ ప్రభుత్వం. పలు నేరాల్లో శిక్ష పడిన ఇద్దరు కువైటీయులు ,ఇద్దరు ఈజిప్షియన్లు, ఒక బంగ్లాదేశీ, ఒక ఫిలిప్పైన్స్ మరియు ఒక ఇథియోపియన్లు ఉన్నారు. వీరంతా హత్య, హత్యా, అపహరణ మరియు అత్యాచారం నేరాలలో దోషులుగా ఉన్నారు. ఈ ఏడుగురు విదేశీయులతోపాటు.. ఇద్దరు కువైట్ పౌరులను కూడా బుధవారం ఉరితీసింది. వీరిలో ఏకంగా రాజవంశీకుడే ఉండటం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. బుధవారం జరిగిన ఉరితీతలు 2013 మధ్య కాలం నుండి ఇప్పటి వరకు చమురు సంపన్న గల్ఫ్ రాష్ట్రంలో మొదటి మరణశిక్షలుగా పేర్కొంటున్నారు. నుస్ర అల్- ఎనేజి , మరో కువైట్ మహిళ, 2009 లో రెండవ భార్యని పెళ్ళికి తీసుకొనివెళ్ళినందుకు ఆమె భర్త పై పగతో ఒక వివాహ పార్టీకి వెళ్లి తన భర్త , సవతిని అంతమొందించాలని ఒక గుడారంకు నిప్పు పెట్టింది. ఈ అగ్ని ప్రమాదంలో మహిళలు మరియు పిల్లలు సహా 57 మంది మాది మసైపోయారు. ఫిలిపినా మరియు ఇథియోపియన్ మహిళలు పని మనుషులుగా ఆ దేశాలకు వెళ్లి అక్కడ యజమానులు కుటుంబాల సభ్యులను చంపిన నేరాలలో దోషులుగా ఉన్నారు. బంగ్లాదేశీ అపహరణ మరియు రేప్ కేసులో నేరస్థుడు కాగా ఇద్దరు ఈజిప్షియన్లు హత్య కేసులలో దోషులుగా ఉన్నారు. సరిగ్గా నాలుగు నెలల క్రితం సౌదీ కూడా యువరాజుకు మరణశిక్ష విధించి కలకలం రేపింది. సౌదీలో అయితే బహిరంగంగా తల నరికి శిక్షను అమలు చేస్తారు. మరి కువైట్‌లో మాత్రం అలా కాదు. దేశ ప్రధాన కారాగారంలో ఉండే ఓ ప్రత్యేక ప్రదేశంలో ఉరి తీస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







