మహిళపై అత్యాచారం కేసులో పోలీస్ స్టేషన్ క్లర్క్‌కి జైలు
- January 26, 2017
పోలీస్ స్టేషన్ క్లర్క్, సిఐడి అధికారినని చెప్పి, ఓ మహిళను బెదిరించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించడంతోపాటుగా, అతన్ని దేశం నుంచి బహిష్కరించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్‌కి అవకాశం ఉంది. నిందితుడు 32 ఏళ్ళ వయసున్న పాకిస్తాన్‌కి చెందిన వ్యక్తి. అయితే, ఈ కేసుతో తనకు సంబంధం లేదని నిందితుడు ఆరోపిస్తున్నాడు. అల్ రఫ్ఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 18న ఈ ఘటన జరిగింది. 19వ తేదీన అల్ అవీర్‌లో నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. బాధితురాలు తన కారులో వెళుతుండగా, నిందితుడు అడ్డుకుని, సిఐడి అధికారని చెప్పి తనను బలవంతంగా ఆ కారులో వేరే చోటకి తీసుకెళ్ళి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







