879 విదేశీ ఖైదీలు
- January 26, 2017
జెద్దాహ్: పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ ప్రిజన్స్‌లో ఉన్న 5,084 మంది ఖైదీల్లో 829 మంది విదేశీయులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. విదేశీ ఖైదీల లిస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్, అంగోలా, ఇథియోపియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, అల్జీరియా, సుడాన్, సోమాలియా, చైనా, ఇరాక్, ఫిలిప్పీన్స్, మొరాకో, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, ఇరాన్, యెమెన్, పాకిస్తాన్, బెల్జియం, బంగ్లాదేశ్, చాద్, టర్కీ, లెబనాన్, మాలి, ఈజిప్ట్, మారిటానియా, పాలస్తీన్, నిగెర్ దేశాలకు చెందినవారితోపాటు ఇంకొందరు కూడా ఉన్నారు. ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో యెమెన్‌కి చెందిన 281 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో 217 మందితో సిరియా, 68 మందితో పాకిస్తాన్ ఉన్నాయి. అయితే అరెస్టయినవారంతా క్రిమినల్స్ కాదనీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు అరెస్టయి ఉంటారని, అమాయకులు విడుదల చేయబడ్తారని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన స్ట్రాటజిక్ ప్లానింగ్ ఆఫీస్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ బస్సామ్ అతియా చెప్పారు. విదేశీయులు దేశంలోని చట్టాల్ని గౌరవిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నామని చెప్పారాయన.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







