మూడు నెలలు వాయిదా ...
- January 27, 2017
సౌత్ ఇండస్ట్రీలో సినిమాల వాయిదాల పర్వం ఇంకా కొనసాగుతోంది. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో పాటు ఇతర సినిమా రిలీజ్ డేట్ లు, రాజకీయ పరిస్థితులు కూడా సినిమాల విడుదల తేదీల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల పెద్ద నోట్ల రద్దు కారణంగా చాలా సినిమాలు వాయిదా పడగా.. ఆ తరువాత కూడా వివిధ కారణాల వల్ల సూర్య సింగం 3 పలు మార్లు వాయిదా పడింది.
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన గురు విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. తమిళ సినిమా ఇరుది సుట్రు కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ముందుగా ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేయాలని భావించినా..
ఇప్పుడు ఏకంగా మూడు నెలలు ఆలస్యంగా ఏప్రిల్ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
జనవరి బరి నుంచి వాయిదా వేసిన తరువాత వరుసగా యంగ్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో గురును సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. తమిళ వర్షన్ డైరెక్టర్ చేసిన సుధా కొంగర తెలుగు సినిమాను కూడా డైరెక్ట్ చేస్తుండగా.. వెంకటేష్ సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







