గల్ఫ్ దేశాల్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు...
- January 26, 2017
మస్కట్ : 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గల్ఫ్ దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. భారత రాయబార కార్యాలయం గురువారం దౌత్యకార్యాలయం ఆడిటోరియం వద్ద 68 వ రిపబ్లిక్ దినోత్సవంను ఘనంగా జరుపుకొన్నారు. ఒమన్ లో భారతీయ దౌత్యవేత్ ఇంద్రునికి మణి పాండే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆబుధాబి యువరాజు శేఖ్ మోహమ్మద్ న్యూఢిల్లీలోని గణతంత్ర వేడుకల్లో స్వయంగా పాల్గొనడంతో పరేడ్ కార్యక్రమాన్ని అల్ ఇమరాతీ అనే అరబ్బీ న్యూస్ ఛానెల్ ప్రత్యక్ష్య ప్రసారం చేసింది. జెద్ధాలో జరిగిన కార్యక్రమంలో కాన్సల్ జనరల్ నూర్ రహేమాన్ శేఖ్ పతాకవిష్కరణ చేసి ప్రవాసీ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం కేంద్రం చేపడుతున్న చర్యలను వివరించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని చదివి వినిపించారు. రియాధ్‌లో భారతీయ రాయబారి జావేద్ అహ్మద్ పతాకవిష్కరణ చేసి.. దేశంలో 30 లక్షలకు పైగా ఉన్న భారతీయులకు మంచి పేరుందని చెప్పారు. దుబాయిలో కాన్సల్ జనరల్ అనురాగ్ భూషణ్ పతాకవిష్కరణ చేసి ప్రసంగించారు. ఈ సారి భారతదేశంలో ముఖ్య అతిథిగా ఆబుధాబి యువరాజు శేఖ్ మోహమ్మద్ పాల్గొనడంతో గల్ఫ్ దేశాలకు గణతంత్ర వేడుకల పట్ల ప్రత్యేకత ఏర్పడిందన్నారు. అనంతరం దుబాయిలోని ఇండియన్ హై స్కూల్లో కూడా ఆయన పతాకవిష్కరణ చేశారు. ఖతర్‌లో భారతీయ కోస్ట్ గార్డుకు చెందిన నౌక స్నేహాపూర్వక పర్యటనకు వచ్చి ఉండడంతో రిప్లబిక్ డే సందర్భంగా భారతీయులు దాన్ని చూడడానికి వెళ్తున్నారు.కువైత్‌లోని భారతీయ ఎంబసీలో జరిగిన కార్యక్రమం.. సందర్భంగా గల్ఫ్ రాయలసీమ సమితి ప్రతినిధులు ప్రవాసీయులకు అల్పాహారాన్ని సమకూర్చారు. ఆబుధాబి, మనమాలలో కూడ కార్యక్రమాలు ఘనంగా జరిగేయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







