ట్యాక్సీ ఆన్ డిమాండ్: మరికొన్ని సంస్థలకు అనుమతులు
- January 28, 2017
మనామా: కింగ్‌డమ్‌లో కొత్తగా మరిన్ని 'ట్యాక్సీ ఆన్ డిమాండ్' సర్వీసులకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం సూచన ప్రాయంగా తెలిపింది. ప్రైవేటు కంపెనీలు నిర్వహించే ఈ కొత్త ట్యాక్సీలు, ప్రీమియర్ సర్వీసుల్ని, సర్టిఫైడ్ డ్రైవర్స్ ద్వారా అందిస్తాయి. స్పెషల్ నెంబర్ ప్లేట్స్ వీటికి ఏర్పాటు చేయడం ద్వారా నార్మల్ ట్యాక్సీలతో వీటికి తేడాని కనిపెట్టం తేలిక. ట్రాన్స్‌పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ కమల్ అహ్మద్ మాట్లాడుతూ, ఈ సర్వీసుల్ని, పబ్లిక్‌కి మెరుగైన సౌకర్యాలు అందించేందుకుగాను, అలాగే బహ్రెయినీలకు ఈ రంగంలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. పార్లమెంటులో ఎంపీ ఖాలిద్ అల్ షయీర్ ప్రశ్నకు సమాధానంగా మినిస్టర్ ఈ వివరాల్ని వెల్లడించారు. ప్రస్తుతం 1460 పర్మిటెడ్ ట్యాక్సీలు ఐలాండ్స్ రోడ్లపై తిరుగుతున్నాయి. స్థానికులు నిర్వహిస్తున్నవి ఇందులో 978 కాగా, ప్రైవేటు సంస్థలు 482 ట్యాక్సీలను నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







