అమెరికన్లపై మేమూ నిషేధం విధిస్తాం: ఇరాన్
- January 28, 2017
టెహ్రాన్, జనవరి 28: ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై అమెరికా వీసా నిషేధం విధించడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. తాము కూడా అమెరికన్లు తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తామని ఆ దేశ విదేశాంగశాఖ ప్రకటించింది. ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్ధం, తర్కరహితం అని ఆ దేశం ఆక్షేపించింది. ఇది ముస్లిం ప్రపంచాన్ని, ఇరాన్ను బహిరంగంగా అవమానించడమేనని పేర్కొంది. కాగా, ''ఇది దేశాల మధ్య గోడలు కట్టాల్సిన సమయం కాదు. కొన్నేళ్ల క్రితమే బెర్లిన్ గోడ బద్దలైన విషయాన్ని ట్రంప్ మర్చిపోయినట్టున్నారు'' అని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ హితవు పలికారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







